Thursday, August 11, 2011


జబ్బుల్ని నయం చేసే నీరు!


bksureshv@gmail.com

విరేచనాల వల్ల మన శరీరం ఎక్కువ నీరు కోల్పోయినప్పుడు ధారాళంగా నీటిని తాగాలి. జ్వరంతో ఉన్న జబ్బులు ఆశించినప్పుడు ఎక్కువ ద్రవాన్ని తాగడం వల్ల త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. విపరీతమైన జ్వరం లేదా వడదెబ్బతగిలినప్పుడు శరీరాన్ని చల్లటినీటితో స్నానం చెయ్యడం లేదా తడిగుడ్డతో ఒళ్ళంతా శుభ్రపరచడం మంచిది. ఉప్పు వేసిన నీటిని రోజంతా ఎక్కువసార్లు తాగాలి.
స్త్రీలలో తరచుగా కనిపించే మూత్ర సంబంధమైన అంటురోగాలకు ఎక్కువ గా ద్రవాలను తాగడం ద్వారా నయం అవుతాయి. అంటురోగాల తీవ్రతను బట్టి వైద్యనిపుణుల సలహాలు చికిత్స అవసర పడతాయి. దగ్గు, ఉబ్బసం, రొమ్ము పడిశం, న్యూమోనియా, కోరింతదగ్గు వచ్చినట్లయితే ఎక్కువనీటిని తాగడం, కఫం తగ్గడానికి వేడినీటి ఆవిరిపట్టడం చాలా మంచిది. పగుళ్ళు, పుళ్ళు, చర్మ సంబంధమైన వ్యాధులు, మొటిమలు వచ్చినపుడు సబ్బుతో బాగారుద్ది గోరువెచ్చటి నీటితో శుభ్రపరచడం మంచిది.
ఈవిధంగా ఉదయం, మధ్యా హ్నం, సాయంత్రం చేస్తూండటం వల్ల వ్యాధులు త్వరితగతిన నయమవు తాయి. చీముపట్టిన గాయాలు, గడ్డలు, సగ్గెడ్డలు వచ్చినపుడు వేడినీటితో కాపడం పెట్టడం మంచిది. కీళ్ళు, కండరాలు నొప్పులు, బెణుకులు వంటివి వస్తే కూడా వేడినీటితో కాపడం బెట్టడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. దురద, మంట, రసికారే దద్దుర్లు ఉన్నప్పుడు చల్లటినీటితో కాపడం పెట్టడం మంచిది. తీవ్రంగా కాలిన గాయాలు అయినప్పుడు నీళ్ళతో శుభ్రం చేయకూడదు. అల్పమైన కాలిన గాయాలు అయిన సందర్భాలలో చల్లని నీటిలో ఉంచడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.
 గొంతునొప్పి, టాన్సిల్స్‌కు చీముపట్టడం వంటి సందర్భాలలో గోరువెచ్చటి ఉప్పునీటితో పుక్కిలించడం శ్రేయస్కరం. ఆమ్లము, దుమ్ములేక ఇతర మండే పదార్థాలు కళ్ళల్లో పడటం వంటి సందర్భాలలో వెంటనే చన్నీళ్ళతో కంటిని కడగటం మంచిది. ముక్కు దిబ్బడ చేసినప్పుడు ఉప్పునీటి ఆవిరి పీల్చడం వల్ల దిబ్బడ తొలుగు తుంది. మల బద్దకం, విరేచనం గట్టిగా అవుతున్న ప్పుడు నీటిని ధారాళంగా తాగాలి.
మొల్లలు, ఆసనం లేదా మలద్వారం వద్ద పుండ్లు ఏర్పడినప్పుడు ఒక తొట్టెలో గోరువెచ్చటి నీరు పోసి, అందులో చిటికెడు పొటాషియం పర మాంగనేట్‌ వేసి అందులో ఆసనం అనేలా కూర్చో వటం వల్ల ఉపశమనం లభిస్తుంది. వ్యాధులు త్వరితగతిన నయ మవుతాయి. ఏది ఏమైనప్పటికీ వ్యాధి లక్షణాలనూ, వ్యాధి తీవ్రతనూ ఎప్పటి కప్పుడు వైద్య నిపుణుల ద్వారా పరీక్షలు చేయించు కుంటూ వారి సలహా మేరకు చికిత్స పొందటం ఉత్తమం.


మోకాలినొప్పి – కారణాలు,నివారణ


మోకాలినొప్పి – కారణాలు,నివారణ


bksureshv@gmail.com

మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణ రహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. మోకాలి సమస్యలకు కారణాలు, వాటి నివారణకు అవసరమైన చర్యలను సూచించేందుకే ఈ ‘ముందుజాగ్రత్త’.
సాధారణంగా మోకాలినొప్పి అనగానే వయసును బట్టి ఆ సమస్యను విశ్లేషించాలి. మోకాలి నొప్పికి వేరు వేరు వయసుల్లో వేర్వేరు అంశాలు కారణమవుతాయి.
కారణాలు: మోకాలి నొప్పులకు పిల్లల్లో, పెద్దల్లో కారణాలు వేరుగా ఉండవచ్చు.
చిన్నవారిలో
మూడు నుంచి పదిహేనేళ్ల వరకు పిల్లల్లో మోకాలి నొప్పికి ఇవీ కారణాలు…
పటెల్లార్ సబ్‌లాక్సేషన్: దీన్నే పటెల్లార్ డిజ్‌లొకేషన్‌గా కూడా చెప్పవచ్చు. మోకాలిచిప్పను పటెల్లా అంటారు. చాలామంది చిన్నపిల్లలు మోకాలి చిప్పను అటూ, ఇటూ జరపడం చూస్తుంటాం. ఇలాంటప్పుడు ఒక్కోసారి మోకాలి ఎముక స్థానభ్రంశం చెందుతుంది. కొన్ని సందర్భాల్లో మోకాలికి బలమైన గాయం తగలడం వల్ల కూడా ఈ మోకాలి చిప్ప తన స్థానం నుంచి తొలగిపోతుంది. దీనితో నొప్పి రావచ్చు.
టిబియల్ అపోఫైసిటిస్: చాలా చురుగ్గా ఆటలాడే పిల్లల్లో, వేగంగా పరుగెత్తే పిల్లల్లో మోకాలికి ముందు భాగంలో నొప్పి వస్తుంది. మోకాలి చిప్ప కంటే కిందన, కాలి కండరం మోకాలికి అంటుకునే ప్రాంతంలో ఈ నొప్పి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీనికి నిర్దిష్టంగా కారణం తెలియదు.
జంపర్స్ నీ: ఈ సమస్య కూడా ఇంచుమించు టిబియల్ అపోఫైసిటిస్‌లాగే ఉంటుంది. చాలా చురుగ్గా ఆటలాడే పిల్లల్లోనే ఇది వస్తుంటుంది. సాధారణంగా లాంగ్‌జంప్ చేసే ఆటగాళ్లలో ఈ తరహా నొప్పి ఎక్కువ. ఇది కూడా మోకాలిచిప్ప ఎముక స్థానభ్రంశం వల్లనే వస్తుందిగానీ, ఈ నొప్పి మోకాలి ముందుభాగంలో ఉంటుంది.
రిఫర్‌డ్ పెయిన్: తొడ ఎముక తుంటి దగ్గర కలిసే ప్రదేశం (గ్రోత్ ప్లేట్)లో ఎముకలు స్థానభ్రంశం కావడం వల్ల ఈ నొప్పి వస్తుంది. సాధారణంగా కాస్త స్థూలకాయం ఉండే పిల్లల్లో ఇది ఎక్కువ. ఆడపిల్లల్లో కంటే మగపిల్లల్లో ఈ నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి వస్తుండటంతో పిల్లలు మోకాలిపై భారం పడకుండా నడిచే ప్రయత్నం చేస్తుంటారు. దాంతో కుంటుతున్నట్లుగా కనిపిస్తుంటారు. సమస్య తొడ ఎముక తుంటి వద్ద కలిసే ప్రదేశంలో వచ్చినా ఈ నొప్పి మాత్రం మోకాలి వద్ద ఉంటుంది. అందుకే దీన్ని రిఫర్‌డ్ పెయిన్ అంటారు.
ఆస్టియోకాండ్రయిటిస్: ఎముకల్లోని మృదులాస్థి (కార్టిలేజ్)లో పగుళ్ల కారణంగా ఈ నొప్పి వస్తుంది. దీనికి పోషకాహారం లోపం కూడా ఒక కారణం. ఇక మితిమీరి ఆటలాడే పిల్లల్లోనూ ఇది కనిపిస్తుంది.
యువకులు, పెద్దవారిలో
సాధారణంగా పిల్లలు, వృద్ధులతో పోల్చి చూస్తే యుక్తవయస్కులు మొదలు పెద్దవారి వరకు మోకాలి నొప్పికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి.
పటెల్లో ఫీమోరల్ పెయిన్ సిండ్రోమ్: ఇది ఒకరకంగా చూస్తే పెద్దల్లో వచ్చే ఆస్టియోకాండ్రయిటిస్ అనుకోవచ్చు. దీనిలో మోకాలి ముందు భాగంలో ఈనొప్పి వస్తుంది.
మీడియల్ ప్లైకా: ఇది పుట్టుకతో (కంజెనిటల్) వచ్చే సమస్య. మోకాలిలో ఉండే కండరాలు బిగుసుకుపోవడం వల్ల ఈ నొప్పి వస్తుంది.
పీస్ అన్సిరైటిస్ బర్సైటిస్: ఈ సమస్యలో మోకాలి కింది భాగంలో లోపలివైపున నొప్పి ఉంటుంది. దీనికి ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు (ఎండోక్రైనల్ డిజార్డర్స్) కారణాలు. ఎక్కువగా ఆటలాడటం కూడా ఈ సమస్యకు ఒక కారణమే.
మెనిస్కల్ టేర్: మోకాలి ఎముకలో ఒక కుషన్ లాంటిది ఉంటుంది. ఈ కుషన్ చిరిగిపోవడం వల్ల వచ్చే సమస్యను మెనిస్కల్ టేర్ అంటారు. ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్ ఆటలు ఆడేవారిలో, జిమ్నాస్టిక్స్ చేసేవారిలో ఈ తరహా సమస్య ఎక్కువ.
మైక్రో ట్రామా: అదేపనిగా ఒకే చోట గాయం కావడం, ఆ గాయంపై మాటిమాటికీ ఒత్తిడి పడి నొప్పి తిరగబెట్టడం వల్ల ఈ నొప్పి వస్తుంది. మోకాలు తిప్పడం వల్ల కూడా ఈ నొప్పి రావచ్చు.
యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ సమస్య: ఎముకనూ కండరాన్నీ కలిపే నిర్మాణాన్ని లిగమెంట్ అంటారు. యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ మోకాలికి స్థిరంగా ఉండేలా దోహదపడుతుంది. ఆటల్లో లేదా
వృద్ధుల్లో
ప్రమాదాల్లో గాయపడటం వల్ల ఈ లిగమెంట్ దెబ్బతిని ఈ తరహా నొప్పి వస్తుంది.
చిన్నపిల్లల్లో, యుక్తవయస్కుల్లో ఉండే కారణాల కంటే కాలక్రమంలో ఎముకల అరుగుదల వల్లనే ఈ వయసువారిలో మోకాలినొప్పి సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.
అర్థరైటిస్: ఎముకల అరుగుదల వల్ల వచ్చే మోకాలి నొప్పి ఇది.
క్రిస్టల్ ఇండ్యూస్‌డ్ ఇన్‌ఫ్లమేటరీ ఆర్థోపతి:
రక్తంలో యూరిక్‌యాసిడ్ మోకాలి చిప్ప ప్రాంతంలో తయారవుతుంది. మోకాలిచిప్ప దగ్గర ఈ రాళ్లు కంకరలా అడ్డుపడుతుండటం వల్ల ఎముక ఒరుసుకుపోయి ఈ నొప్పి వస్తుంది.
గౌట్:
ఈ సమస్య కూడా రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లు పెరగడం వల్లనే వస్తుంది. అయితే రాళ్లు ఏర్పడటం కాకుండా కండరాలు బిగుసుకుపోయి నొప్పి, మంట (ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్) వల్ల ఈ నొప్పి వస్తుంది.
సూడో గౌట్:
దీనిలోనూ గౌట్ వ్యాధిలో ఉండే లక్షణాలే కనిపిస్తుంటాయి. కానీ… రక్తపరీక్షలో మాత్రం యూరిక్ యాసిడ్ పాళ్లు పెరిగినట్లుగా ఉండదు. ఆ పరీక్షలో నార్మల్‌గా ఉంటుంది. అయితే దీనికి కూడా గౌట్ వ్యాధికి ఉపయోగించే మందులే వాడతారు.
పాప్లీటియర్ సిస్ట్స్:
కండరాల మధ్య వచ్చే నీటి బుడగల వల్ల వచ్చే నొప్పి ఇది. మోకాలి కింది భాగంలో ఈ నొప్పి వస్తుంది. ఇన్ఫెక్షన్ ఉండటం వల్లకూడా ఇది రావచ్చు.
మోకాలి నొప్పి కంటిన్యువస్‌గా వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. సమస్యను బట్టి నిపుణులు చికిత్స చేస్తారు. ఒకవేళ పెద్ద వయసువారిలో అయితే అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స, మోకాలి మార్పిడి ఆపరేషన్ అవసరం కావచ్చు.
అది మోకాలిపైన తొడ ఎముక (ఫీమర్), కాలి ఎముక (టిబియా)లు కలిసే ప్రాంతంలో ఉండి పైన మోకాలి చిప్ప (పటెల్లా) అనేక ఎముకలతో సంక్లిష్టమైన కండరాల బంధంతో ఉంటుంది. నిర్మాణంలో సంక్లిష్టతలు ఎక్కువ కాబట్టి అక్కడి నొప్పి ఎప్పుడూ అలక్ష్యం కూడదు.
నివారణ ఇలా…
ఏదైనా పని మొదలు పెట్టే ముందర అకస్మాత్తుగా మోకాలిని కదిలించవద్దు. గబుక్కున లేవడం / కూర్చోవడం చేయవద్దు.
జాగింగ్ లేదా రన్నింగ్ చేసే ముందు కాసేపు నడవండి.
సమతలంగా ఉండే ప్రదేశంలోనే జాగింగ్‌గానీ, రన్నింగ్‌గానీ చేయండి. ఎగుడుదిగుడుగా ఉండే ప్రాంతాల్లో వద్దు.
మట్టి మృదువుగా ఉండే ప్రాంతంలోనే వాకింగ్, జాగింగ్ చేయాలి. కఠినంగా ఉండే బండల (హార్డ్ సర్ఫేస్)పై అలాంటి వ్యాయామాలు చేయడం సరికాదు.
వ్యాయామం చేసే ముందర తగినంత వార్మప్ చేయండి.
మోకాళ్లకు శ్రమ కలిగించే వృత్తుల్లో ఉన్నవారు, దానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం కూడా అవసరం. మోకాళ్లు మడిచి కూర్చోవడం సాధ్యమైనంతగా తగ్గించండి.
కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షణలను ధరించండి. మహిళలు అయితే ఎక్కువగా హీల్ ఉండే పాదరక్షలను వేసుకోకపోవడమే మంచిది. మీ బరువును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోండి. బరువు పెరుగుతున్నకొద్దీ మోకాలిపై భారం పెరుగుతుంటుందని గుర్తుంచుకోండి.

వెల్లుల్లి ఒక ఆరోగ్య రక్షా కవచం


వెల్లుల్లి ఒక ఆరోగ్య రక్షా కవచం

bksureshv@gmail.com


మనలో చాలామందికి జలుబు ముక్కు దిబ్బడ, జ్వరం వస్తూ వుంటాయి. వాళ్ళు వెల్లుల్లి రోజూ ఆహారంలో తీసుకుంటే వ్యాధినిరోధశక్తి పెరిగి తరచుగా వచ్చే స్థితిని తగ్గిస్తుంది. అందువల్ల అరచెమ్చా నేతిలో వేయించిన రెండు వెల్లుల్లి పాయలను క్రమం తప్పకుండా రోజు తినడం మంచిది.
నీ ముఖం, శరీరం, వర్చస్సు ఆకర్షణీయంగా వుండాలంటే రెండు వెల్లుల్లి పాయలరసం అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి తీసుకోండి. దీని వలన రక్తం శుభ్రపడుతుంది. దేహకాంతి పెరుగుతుంది. అపుడు చాక్లెట్లు మసాలావస్తువులు తినకూడదు. ఒళ్ళు తగ్గాలనుకుంటున్నారా, సగం నిమ్మ కాయ రసంతో, కొంచెం వేడినీళ్ళు కలిపి అందులో రెండు చిన్నవెల్లుల్లి పాయలని కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటుంటే క్రమంగా ఒళ్ళు తగ్గుతుంది. అలా మూడు నెలలు తీసుకోండి చాలు. కాని ఆ సమయం లో కొవ్వు పదార్థాలు, పగటినిద్ర మానేయండి. కొంచెం సేపు నడవండి. చెవిపోటు వస్తే వేడి చేసిన వెల్లుల్లిరసం నాలుగు చుక్కలు చెవిలో వేయండి.
కడుపుతో వున్నప్పుడు రోజు ఒక వెల్లుల్లిని పాలతో తీసుకుంటే కడుపులో బిడ్డ బలంగా ఎదుగుతాడు.
రోజూ రెండు వెల్లుల్లిపాయలను క్యాన్సర్‌ వున్నవాళ్ళు తీసుకుంటే, క్యాన్సర్‌ కణాలు తిరిగి గడ్డకట్టడం దూరమవుతుంది.
మోకాళ్ళు నొప్పులు వున్నవాళ్ళు వెల్లుల్లి రసం ఎనిమిది చుక్కలు అరగ్లాసుపాలలో కలిపి తీసుకుంటే చాలా మంచిది. వెల్లుల్లి నూనెగా, చుక్కల మందుగా రసాయనిగా ఆయింట్‌మెంట్‌గా వాడతారు. వెల్లుల్లి, గుండెజబ్బులు రాకుండా, రక్తవాహికలో కొవ్వు చేరకుండా శరీరంలో సహజరక్షణశక్తి తగ్గకుండా ఉంచుతుంది. అని నిర్ధారించారు వైద్యులు. క్యాన్సర్‌ వ్యాధి నుండి వెల్లుల్లి రక్షణనిస్తుంది.
వెల్లుల్లిలో అత్యవసర విటమిన్లు మినరల్స్‌ ఉంటాయి. ఎబిసిడిఇ విటమిన్లు జర్మేనియం వున్నాయి. ఇది శరీర రక్షణ శక్తిని పెంచి శరీరంలో వున్న మలినాలను బయటకు పంపేందుకు సహాయపడుతుంది.
అనేక పరిశోధనల్లో తేలిందేమంటే పాత వెల్లుల్లి వండికాని వండకుండా కాని తీసుకుంటే గుండెజబ్బులురావని వచ్చినవాళ్ళకి గుండెని కాపాడే చక్కటి మందు. పాతవెల్లుల్లిలో సల్ఫర్‌ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో వంటబట్టేశక్తి వుండటం వల్ల గుండె జబ్బులోను శరీరపు గాయాలు మానేశక్తిని పెంపొందించటంలో చాలా సహాయపడుతుంది. వెల్లుల్లిని మితంగా వాడకూడదు. కొంతమందికి వేడి చేస్తుంది. కొంతమందికి చర్మంపై దద్దుర్లు వస్తాయి. అలాంటప్పుడు వెల్లుల్లి వాడకాన్ని తగ్గించండి.

కంటిని కాపాడుకోండి…bksureshv@gmail.com


కంటిని కాపాడుకోండి…


bksureshv@gmail.com

కేవలం దృష్టి లోపానికే కాదు… కనుగుడ్డు అందంగా కనిపిం చేందుకు కూడా నేటి తరం కాంటాక్ట్‌లె న్స్‌లని తెగ వాడేస్తున్నారు. మరి కొందరు మరో అడుగు ముందేసి వివిధ రంగుల్లో డ్రస్‌ కలర్‌కి మ్యాచ్‌ అయ్యేలా కాంటాక్ట్‌లె న్స్‌లని వాడుతున్నారు. అలాగే కంటి అద్దాల వాడ కం కూడా ఈ మధ్య బాగా పెరుగుతోంది.
అయితే కంటి లెన్స్‌లు ఇష్టానుసారం తమకు నచ్చిన విధంగా వాడటం వల్ల కంటిలోని సున్నితమైన భాగాలు కూడా రేడియేషన్‌ ప్రభావంకు లోనవుతాయని వీటిపై అధ్యయనం చేసిన రాజ రామ న్న అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు మాజీ కార్యదర్శి డాక్ట్టర్‌ కె.ఎస్‌. పార్ధసారధి వెల్లడించారు.
సాధారణంగా కంటి అద్దాలు కొంత మేర రేడియేషన్‌ ప్రభా వాన్ని కలిగిస్తాయి. దీనివల్ల కంటి లొపలి భాగా లువిపరీతమైన వత్తిడికి లోనై బాధ పడతాయి. అందువల్ల ఎక్కువమందిలో తల నొప్పి, పార్శనొప్పిలాంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యని చెప్పారు. శుక్లాలు ఉన్న వ్యక్తు లు ధరించే కంటి అద్దాలు పరిణామా లను వీలైనంత తక్కువగా చేసి దృష్టి లోపాలనుసరిదిద్దాలన్న ధ్యేయంతో అంతర్జాతీయ కమీషన్‌ ఆఫ్‌ రేడి యోలాజికల్‌ ప్రొటెక్షన్‌ (ఐసిఆర్‌పి) గాగుల్స్‌ పరిణామాన్ని తగ్గించిం దని చెప్పారు.
రేడియాలజీ, కార్డియాలజీ నిపుణులకు ఈ విష యాలపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని వెల్లడిస్తున్నారు. నేటి సమాజంలో వస్తు న్న వివిధ పరి ణామాలను దృష్టిలో ఉంచుకుని ఐసిఆర్‌పి రూపొందించి న వివరాలు వెల్లడిస్తూ… ప్రస్తుత కాలంలో కంటి అద్దాలు 50 మిల్లీ సివె రేట్‌కి మించి వాడుతుండటం వల్ల అవి కొంత కాలానికే స్పష్టత కోల్పోయి, మసకబారి పోతున్నాయని… దీని వల్ల కంటికి సంబంధించిన అనేక దుష్పరిణామా లు వస్తున్నాయని అన్నారు.
అదే 20 మిల్లీ సివెరేట్‌కి కంటి అద్దాల మందాన్ని తగ్గించి వాడితే.. ఏడాది పాటు మాత్రమే పనికి వస్తాయనుకునే వాటిని 5 ఏళ్ల పాటు వాడుకోవచ్చని, దీని వల్ల కంటికి వచ్చే ప్రమాదాలను నివారించు కొవటమే కాక కంటి లోపాలను అధిగమించకోవచ్చని తన అధ్యయనం లో తేలినట్లు పార్ధసారధి చెప్పారు.