Thursday, August 11, 2011


జబ్బుల్ని నయం చేసే నీరు!


bksureshv@gmail.com

విరేచనాల వల్ల మన శరీరం ఎక్కువ నీరు కోల్పోయినప్పుడు ధారాళంగా నీటిని తాగాలి. జ్వరంతో ఉన్న జబ్బులు ఆశించినప్పుడు ఎక్కువ ద్రవాన్ని తాగడం వల్ల త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. విపరీతమైన జ్వరం లేదా వడదెబ్బతగిలినప్పుడు శరీరాన్ని చల్లటినీటితో స్నానం చెయ్యడం లేదా తడిగుడ్డతో ఒళ్ళంతా శుభ్రపరచడం మంచిది. ఉప్పు వేసిన నీటిని రోజంతా ఎక్కువసార్లు తాగాలి.
స్త్రీలలో తరచుగా కనిపించే మూత్ర సంబంధమైన అంటురోగాలకు ఎక్కువ గా ద్రవాలను తాగడం ద్వారా నయం అవుతాయి. అంటురోగాల తీవ్రతను బట్టి వైద్యనిపుణుల సలహాలు చికిత్స అవసర పడతాయి. దగ్గు, ఉబ్బసం, రొమ్ము పడిశం, న్యూమోనియా, కోరింతదగ్గు వచ్చినట్లయితే ఎక్కువనీటిని తాగడం, కఫం తగ్గడానికి వేడినీటి ఆవిరిపట్టడం చాలా మంచిది. పగుళ్ళు, పుళ్ళు, చర్మ సంబంధమైన వ్యాధులు, మొటిమలు వచ్చినపుడు సబ్బుతో బాగారుద్ది గోరువెచ్చటి నీటితో శుభ్రపరచడం మంచిది.
ఈవిధంగా ఉదయం, మధ్యా హ్నం, సాయంత్రం చేస్తూండటం వల్ల వ్యాధులు త్వరితగతిన నయమవు తాయి. చీముపట్టిన గాయాలు, గడ్డలు, సగ్గెడ్డలు వచ్చినపుడు వేడినీటితో కాపడం పెట్టడం మంచిది. కీళ్ళు, కండరాలు నొప్పులు, బెణుకులు వంటివి వస్తే కూడా వేడినీటితో కాపడం బెట్టడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. దురద, మంట, రసికారే దద్దుర్లు ఉన్నప్పుడు చల్లటినీటితో కాపడం పెట్టడం మంచిది. తీవ్రంగా కాలిన గాయాలు అయినప్పుడు నీళ్ళతో శుభ్రం చేయకూడదు. అల్పమైన కాలిన గాయాలు అయిన సందర్భాలలో చల్లని నీటిలో ఉంచడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.
 గొంతునొప్పి, టాన్సిల్స్‌కు చీముపట్టడం వంటి సందర్భాలలో గోరువెచ్చటి ఉప్పునీటితో పుక్కిలించడం శ్రేయస్కరం. ఆమ్లము, దుమ్ములేక ఇతర మండే పదార్థాలు కళ్ళల్లో పడటం వంటి సందర్భాలలో వెంటనే చన్నీళ్ళతో కంటిని కడగటం మంచిది. ముక్కు దిబ్బడ చేసినప్పుడు ఉప్పునీటి ఆవిరి పీల్చడం వల్ల దిబ్బడ తొలుగు తుంది. మల బద్దకం, విరేచనం గట్టిగా అవుతున్న ప్పుడు నీటిని ధారాళంగా తాగాలి.
మొల్లలు, ఆసనం లేదా మలద్వారం వద్ద పుండ్లు ఏర్పడినప్పుడు ఒక తొట్టెలో గోరువెచ్చటి నీరు పోసి, అందులో చిటికెడు పొటాషియం పర మాంగనేట్‌ వేసి అందులో ఆసనం అనేలా కూర్చో వటం వల్ల ఉపశమనం లభిస్తుంది. వ్యాధులు త్వరితగతిన నయ మవుతాయి. ఏది ఏమైనప్పటికీ వ్యాధి లక్షణాలనూ, వ్యాధి తీవ్రతనూ ఎప్పటి కప్పుడు వైద్య నిపుణుల ద్వారా పరీక్షలు చేయించు కుంటూ వారి సలహా మేరకు చికిత్స పొందటం ఉత్తమం.


No comments:

Post a Comment